ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (రథసారథి న్యూస్):
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు.
ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక పోలీసు స్టేషన్లలో సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఎస్పీ పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.



