Sangareddy

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, హకీమ్, చింత సాయినాథ్, సునీల్ జైన్, కొండల్‌రెడ్డి, నాగరాజుగౌడ్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button