సీఎం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సభ విజయవంతం కోసం కృషి చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సభ ఏర్పాట్లను ముందుండి నడిపించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించడం జిల్లా ప్రజలకు గర్వకారణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులతో పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు.



