Sangareddy

సంగారెడ్డి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఎంపీకి కృతజ్ఞతలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 19 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చేలా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, ఆధునిక పార్సెల్ యూనిట్ మంజూరు చేయించిన ఎంపీ రఘునందన్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పవన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందన్‌రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా పవన్ ముదిరాజ్ మాట్లాడుతూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, ఆధునిక పార్సెల్ యూనిట్ మంజూరు కావడం సంగారెడ్డి ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఎంపీ రఘునందన్‌రావు ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్ సేవా కేంద్రం, ఆధునిక పార్సెల్ యూనిట్‌తో పాటు త్వరలో తత్కాల్ టికెట్ బుకింగ్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయికోటి రమేష్, బీజేపీ జిల్లా కార్యదర్శులు రవిశంకర్, నాగరాజు, పట్టణ అధ్యక్షుడు వాసు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశ్వంత్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సుభాష్ జాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి శ్రీనాథ్, కొర్పోల్ సర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, బీజేపీ నాయకులు గురునాథ్, మోహన్, సాయి, ప్రభుగౌడ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button