Sangareddy

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 14 (రథసారథి న్యూస్): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించి మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, చింత సాయినాథ్, కొండల్‌రెడ్డి, విఠల్, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, శ్రవణ్‌రెడ్డి, హరిప్రసాద్, రవి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button