Sangareddy
వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకొని సంగారెడ్డిలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ సేవలను, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పోషించిన ధైర్యసాహసాల పాత్రను నాయకులు స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామా గౌడ్, వెంకటేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



