Sangareddy
వీరనారి చాకలి ఐలమ్మ సేవలు చిరస్మరణీయ -అడిషనల్ కలెక్టర్ పాండు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్):
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ పాండు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలకు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటానికి సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



