ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు మట్టి వినాయక విగ్రహం అందజేత

పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్): సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను బీఆర్ఎస్వీ నాయకుడు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని, భవిష్యత్ తరాల ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ కోసం పర్యావరణహిత విధానాలను ప్రజలు అలవర్చుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నాయకులు చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో అసద్, అడ్నాన్, సబీల్ తదితరులు పాల్గొన్నారు.



