•జాతీయ మెగా లోక్-అదాలత్‌కు అపూర్వ స్పందన–3,793 కేసుల్లో రాజీ.
సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ: 50.13 లక్షలు తిరిగి బాధితులకు అందేలా కోర్ట్ ఆదేశాలు..

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 13 (రథసారథి న్యూస్):
జాతీయ మెగా లోక్-అదాలత్ విజయవంతం అయిన సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, రాజీ పడటానికి అవకాశం ఉన్నటువంటి 819 – ఐపిసి కేసులలో ఇరు వర్గాలను రాజీ కుదిరచడం జరిగిందని, 1135 – ఇ-పెట్టి, 1839 – డిడి కేసులలో అడ్మిషన్/ జరిమాజన విధించడం జరిగిందని తెలిపారు.
సైబర్ నేరాలకు సంభందించి జిల్లాలో నమోదైన 58 సైబర్ క్రైమ్ కేసులలో రూ: 43.5 లక్షలు, ఎఫ్ఐఆర్ లేకుండా 73 కేసులలో 7.8 లక్షల రూపాయలను తిరిగి సైబర్ బాధితులకు ఇప్పించేందుకు కోర్ట్ నుండి అనుమతి పొందడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.
రాజీ మార్గమే రాజా మార్గం అని, రాజీ పడటం ద్వారా ఇరువర్గాలు సమఉజ్జులు ఉంటారని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులల్లో ఇరు వర్గాలు రాజీపడడం ఉత్తమం అన్నారు. జిల్లా పోలీసుల అత్యుత్తమ పనితీరును కొనియాడుతూ, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో జిల్లా పోలీసులు కనబరిచిన అసాధారణ ప్రతిభను జిల్లా ఎస్పీ అభినందించారు. విధి నిర్వహణలో వారి అంకితభావం, సమన్వయం, సేవా దృక్పథం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇలాంటి అత్యుత్తమ పనితీరు జిల్లా పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
జాతీయ లోక్-అదాలత్ ను విజయవంతం చేసిన అధికారులు వర్టికల్ డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, డి4సి- డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, లైజనింగ్ అధికారి సత్యనారాయణ ఎస్ఐ, కోర్ట్ డ్యూటీ అధికాలు, సైబర్ సెల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.



