Sangareddy

ఘనంగా ప్రారంభమైన వాసవి కన్యకా పరమేశ్వరి శిఖర ప్రతిష్టాపన వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం శిఖర ప్రతిష్టాపన వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మొదటిరోజు గణపతి పూజ, పుణ్యవాచనం, దీక్షాధారణ, మంటప ప్రవేశం, మాతృక యోగిని, నవ చండీయాగ కార్యక్రమాన్ని నిర్వహించారు.

భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి జూలకంటి మల్లేశం, ఉపాధ్యక్షులు మ్యాడం రాధా కిషన్, కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్ సభ్యులు నామ భాస్కర్, జూలకంటి బుచ్చిలింగం, ఆమేటి కిట్టు, పుల్లూరి ప్రకాష్, ఆమెటి భాస్కర్, గుండ్లపల్లి నరేష్ కుమార్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button