త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డు రెడ్డికాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
వినాయక చవితి సందర్భంగా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న త్రిశూల్ యూత్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, విఠల్, శ్రవణ్ రెడ్డి, లాడే బాలు, స్థానిక నాయకులు, యువకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



