Sangareddy

సదాశివపేటలో వైభవంగా చీల మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల ఊరేగింపు

-భక్తిశ్రద్ధలతో సాగిన దుర్గమ్మ జాతర వేడుకలు.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో దుర్గమ్మ జాతర ఉత్సవాల సందర్భంగా బుధవారం చీల మల్లన్న ఆధ్వర్యంలో సంప్రదాయ ఎడ్లబండ్ల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనాదికాలం నుంచి కొనసాగుతున్న చీల కుటుంబ పరంపరలో భాగంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ ఎడ్లబండ్ల ఊరేగింపు ఈసారి కూడా భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండ్లతో నిర్వహించిన ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగగా, పెద్ద సంఖ్యలో భక్తులు, యువకులు, మహిళలు పాల్గొని అమ్మవారికి జైకొడుతూ భక్తి పారవశ్యంలో ఊరేగింపును వీక్షించారు.

సంప్రదాయ డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, దుర్గమ్మ జాతరలో చీల కుటుంబం నిర్వహించే ఎడ్లబండ్ల ఊరేగింపుకు దశాబ్దాల చరిత్ర ఉందని, ఈ సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో ఇలాంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, సామాజిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా చీల విశ్వేశ్వర్, చీల వీరన్న, చీల శివచంద్ర, చీల వేషాల, బోడగ్గమ్మ సంగన్న, బోడగ్గమ్మ వీరన్న, బ్రహ్మస్వామి, చందు స్వామి, ఎంఆర్‌ఎఫ్ ఉద్యోగి ఈశ్వరప్ప తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీతో సదాశివపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button