రామ్ మందిర్ గణపతి వేడుకల్లో సంగీత విభావరి
-భక్తిగీతాలతో అలరించిన సినీ నేపథ్య గాయకులు డోలక్ వాయిస్తూ భజన పాటలు ఆలపించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17(రథసారథి న్యూస్): గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి రాంనగర్‌లోని రామ్ మందిర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి సంగీత విభావరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఆలపించిన భక్తిగీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మండపం వద్ద డోలక్ వాయిస్తూ భజన పాటలు ఆలపించి భక్తులను ఉత్సాహపరిచారు. ఒకవైపు భక్తిగీతాలు, మరోవైపు భజన పాటలతో రామ్ మందిర్ పరిసరాలు ఆధ్యాత్మిక సందడితో మార్మోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు సంగీత విభావరి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. కార్యక్రమంలో జగ్గారెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, జయారెడ్డి, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకున్నారు.



