హన్మయ్య నాయక్ తండాలో మద్య నిషేధానికి గ్రామసభలో తీర్మానం
పుల్కల్ మండలంలోని లక్ష్మీసాగర్ (హన్మయ్య నాయక్ తండా) గ్రామపంచాయతీ సర్పంచ్ కవిత సేనాపతి ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్):
పుల్కల్ మండలంలోని లక్ష్మీసాగర్ (హన్మయ్య నాయక్ తండా) గ్రామపంచాయతీ సర్పంచ్ కవిత సేనాపతి ఆధ్వర్యంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు.
గ్రామసభలో తండాలో మద్యం వల్ల కుటుంబాలు, యువత, సమాజంపై పడుతున్న దుష్ప్రభావాలపై గ్రామస్తులు చర్చించారు. అనంతరం గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు ఏకగ్రీవంగా తండాలో మద్యం అమ్మకాలు, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా మద్య నిషేధానికి గ్రామస్థులందరూ సహకరించాలని, గ్రామాన్ని మద్య రహిత తండాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.. మద్యం నిషేధంపై గ్రామస్తులు కలిసి తీర్మానం చేసి సర్పంచ్ కవిత సేనాపతి, అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత సేనాపతి, ఉప సర్పంచ్ గణేష్ , వార్డ్ సభ్యులు , గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు…



