Sangareddy
ఏపూరి సోమన్న సభను విజయవంతం చేయాలి-నగేష్ కురుమ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్): హైదరాబాద్లోని రవీంద్రభారతిలో రేపు నిర్వహించనున్న ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగేష్ కురుమ కోరారు. ఏపూరి సోమన్న అభిమానులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమన్న 25 ఏళ్లుగా సాగిస్తున్న పాటల ప్రస్థానాన్ని గుర్తుచేసుకునే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.



