ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల జాతర మహోత్సవం

సికింద్రాబాద్, ఆగస్టు 17 (రథసారథి న్యూస్): తుకారాంగేట్‌లోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో ఈ నెల 16, 18 తేదీల్లో బోనాల జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారికి బోనాల సమర్పణ, ఊరేగింపు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
సోమవారంఆగస్టు 16న ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకం, 6 గంటలకు అలంకరణ, 7 గంటలకు కుంకుమార్చన, 8 గంటలకు తొలిబోనాల సమర్పణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక పూజా కార్యక్రమం, సాయంత్రం 3 గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా ఆగస్టు 18న ఉదయం 7 గంటలకు అమ్మవారికి అభిషేకం, 8 గంటలకు కుంకుమార్చన, 10 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనంతరం అమ్మవారికి నైవేద్యం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బోనాల జాతర మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తుల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.



