ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంత్రి సమీక్ష

హైదరాబాద్ ప్రతినిధి, ఆగస్టు 5 (రథసారథి న్యూస్): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య–ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నివాసంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జులు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, డా. వంశీకృష్ణ, శంకరయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, డీసీసీ అధ్యక్షులు రాజీవ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక, సహకార సంఘాల ఎన్నికల వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, ఆశావహుల వివరాలను పీసీసీకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.



