సెప్టెంబర్ 3న యూడీఐడీ (సదరం) శిబిరం
-సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహణ..
-ముందుగా స్లాట్ నమోదు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్): దివ్యాంగుల ప్రత్యేక గుర్తింపు కార్డు (యూడీఐడీ) కోసం సెప్టెంబర్ నెలలో నిర్వహించే సదరం శిబిరాన్ని సెప్టెంబర్ 3న గురువారం ఉదయం 10 గంటలకు సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. యూడీఐడీ పోర్టల్లో కొత్తగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డును పునరుద్ధరించుకునేందుకు నిరంతరం స్లాట్లు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు.
పోర్టల్ ద్వారా ముందుగా స్లాట్ నమోదు చేసుకుని, అనంతరం ఫోన్ లేదా సందేశం ద్వారా సమాచారం అందిన వారికి మాత్రమే శిబిరంలో హాజరయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. శిబిరానికి వచ్చే వారు ప్లాట్ పేపర్, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్టు సైజు ఫొటో, సంబంధిత వైద్య నివేదికలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన వారు ముందస్తుగా స్లాట్ నమోదు చేసుకుని, నిర్ణీత సమయానికి అవసరమైన పత్రాలతో శిబిరానికి హాజరు కావాలని అధికారులు కోరారు.



