Narayankhed

ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం !

జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి జర్నలిస్టులకు క్రమశిక్షణ చాలా అవసరం : రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్

నారాయణఖేడ్ ప్రతినిధి సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్): :

జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయి నుంచి గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని, ఐక్యంగా ఉద్యమిస్తామని టీయూడబ్ల్యూజే–ఐజేయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలు, సంఘం బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టుల సమస్యలను ప్రత్యేకంగా నమోదు చేసి జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందేలా చూడడంతో పాటు ఇంటి స్థలాలు, ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.

చిన్న, మధ్య తరహా పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ఫొటో జర్నలిస్టులకు సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సభ్యత్వ విస్తరణతో పాటు మండల స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేయాలని సూచించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే. పైసల్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు సంఘటిత శక్తే ప్రధాన బలమన్నారు. సమస్య ఏ ఒక్క జర్నలిస్టుదైనా యూనియన్ సమస్యగా భావించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు.సమావేశంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొని స్థానిక సమస్యలను వివరించారు. రాష్ట్ర ప్రతినిధి బాసిత్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు సిద్ధన్న పాటిల్,
జిల్లా ప్రధాన కార్యదర్శి రు మాండ్ల అనిల్, ఉపాధ్యక్షులు
శ్రీనాథ్ మతీన్,ఆర్ సత్యనారాయణ రెడ్డి, మల్లేశం,
జాయింట్ సెక్రటరీలు ఉల్లిగడ్డల శివకుమార్ , శ్రీనివాసరెడ్డి ,,ఎంఏ రవూఫ్
ఆర్గనైజింగ్ సెక్రటరీలు విలాస్ విల్సన్ ,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఆసిఫ్, ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి శ్రీధర్ జైన్,
చిన్న , మధ్య తరహా పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి చవాన్ ఈశ్వర్, కోశాధికారిగా లక్ష్మణ్ , ఉపాధ్యక్షుడు నజీర్,
సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీనాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button