
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్): తారా ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 17వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రవీణ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్ఐఐటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కళాశాలలోని వాణిజ్య విభాగ నూతన భవనంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐసీఐసీఐ సంబంధాల నిర్వాహకుల ఉద్యోగానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని, ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఇంజినీరింగ్, సాంకేతిక విద్యలో పట్టాలు పొందిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అనర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రెండు ప్రతుల స్వీయ వివరాల పత్రం, పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అసలు ధ్రువపత్రాలతో పాటు వాటి నకలు ప్రతులు, ఆధార్ లేదా పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రం, రెండు పాస్‌పోర్టు పరిమాణం ఛాయాచిత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం కళాశాల నియామక అధికారి వీరేందర్‌ను 9491884475 నంబర్లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.



