సర్ ను ప్రక్రియ ను వేగవంతం చేయాలి
మంత్రి దామోదర్ రాజనర్సింహ బూత్ లెవెల్ ఏజెంట్స్ లకు పిలుపు

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి
-సర్ పై అలసత్వం వద్దు
-బి ఎల్ ఏ లు ఓటర్ల నమోదు లో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
-ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో ఓటర్లకు సహాయాన్ని అందించాలి
-మంత్రి దామోదర్ రాజనర్సింహ బూత్ లెవెల్ ఏజెంట్స్ లకు పిలుపు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్):
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవంతం పై ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి, రాయికోడ్, ఆందోల్, పుల్కల్ , చౌటకూర్, రేగోడ్, రాయికోడ్ , వట్పల్లి, అల్లదుర్గ్, మండలాల బి ఎల్ ఏ లు , మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సంగారెడ్డి లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బూతు లెవెల్ ఏజెంట్స్ కు, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులకు అవగాహన కల్పించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయరాదని బి ఎల్ ఏ లకు మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో బూతు లెవల్ ఏజెంట్లు ఎదుర్కున్న అనుభవాలను, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బూతుల వారిగా ఎన్ని ఓట్లు నమోదు అయ్యాయి, నమోదు కాని ఓటర్లు వివరాలు వెంటనే సేకరించి వారి ఎన్యూమరేషన్ ఫారాలను అందించి ఓటరు గా నమోదు కు అవసరమైన సహాయం అందించాలని బి ఎల్ ఏ లకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. అందుకు అవసరమైన అవగాహనను ఓటర్లకు కల్పించేలా బి ఎల్ ఏ లు కృషి చేయాలన్నారు.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అలసత్వం లేకుండా బూత్ ల వారీగా రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ఓటర్ల తో సమన్వయ చేసుకొని గడువులోగా సర్ ప్రక్రియను పూర్తిచేసి ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ కోసం బూత్ లెవెల్ అధికారుల లకు అందించాలన్నారు. బి ఎల్ ఏ లు బూతుల వారిగా సమన్వయం చేసుకొని కార్యకర్తలు, బి ఎల్ ఏ లు, ప్రజా ప్రతినిధులు సహకరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పి సి సి డాక్టర్స్ సెల్ చైర్మన్ డా. రాజీవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఆందోల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్, బాలాజీ నరసింహులు, దుర్గారెడ్డి, దశరథ్, రమేష్ జోషి , శివరాజ్, శేషారెడ్డి, దిగంబర్ రావు, రమేష్ లు, మాజీ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్స్ , ఇతర ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.



