Sangareddy

ఆచార్య జయశంకర్‌కు జిల్లా పోలీసుల ఘన నివాళి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, సమాన అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం అనే విలువలతో ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ శాంతియుత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మావతి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఆర్‌ఐలు రాజశేఖర్ రెడ్డి, డానియెల్‌తో పాటు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button