Sangareddy

దళిత విలేకరి పై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

దళిత విలేఖరి అక్రిడేషన్ కార్డును ఆపడం సరైనది కాదు

కేవీపీఎస్ డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 31 (రథసారథి న్యూస్):

దళిత విలేకరి రాములు పై ఆకారణంగా దాడి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి చట్టపరమైన చర్యలు తీసుకోని సస్పెండ్ చేయాలనీ కోరుతూ బాధితుడు రాములు తో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎ. మాణిక్, జిల్లా కార్యదర్శి పి. అశోక్ మాట్లాడుతు జిల్లాలోని పత్రికలో నారాయణ ఖేడ్ నియోజకవర్గం ఇంచార్జి గా దండు రాములు పనిచేస్తు ప్రజా సమస్యలు వెలికి తీసేవారని మార్చి 17న మనూరు మండలం అతిమ్యల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని అనుమతితో పాఠశాలలో జరుగుతున్న మంచి విషయాలను తమ పత్రికలో రాయడానికి వెళ్లిన రాములు పై అదే పాఠశాలలో పని చేస్తున్న మహేష్ కుమార్ అనే ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆయన దాడి చేయడంతో పాటు గ్రామపంచాయతీలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషిస్తూ నువ్వు విలేకరివ అంటూ అవమానిస్తూ కొట్టారని దళిత విలేఖరి పై కులం పేరుతో దూషిస్తూ అవమానపరిచి కొట్టిన ఉపాధ్యాయుడు మహేష్ కుమార్ పై ఇప్పటివరకు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని.

సమగ్రమైన విచారణ జరిపి దళిత విలేఖరి దండు రాములు పై దాడి చేసిన ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని దళితుడు రాములు పై ఎఫ్ ఐ ఆర్ ఉందానే పేరుతో అక్రిడేషన్ కార్డు ఆపారని కానీ అగ్రకుల ఉపాధ్యాయుడు పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైన ఆయన మాత్రం మాత్రం యధావిధిగా తన ఉద్యోగం చేసుకుంటున్నాడని దళిత విలేఖరి వర్తించే నిబంధనలు అగ్రకుల ఉపాధ్యాయుడికి వర్తించవా అని ప్రశ్నించారు దళిత విలేకరి దండురాములు కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు అనిల్ బుద్ధ, కెవిపిఎస్ జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button