అంగన్‌వాడీ టీచర్లపై అధికారుల ఒత్తిడి తొలగించాలి
పెండింగ్‌లో ఉన్న బీఎల్‌ఓ పారితోషికాన్ని వెంటనే చెల్లించాలి

టీయూసీసీ నాయకుడు చిరంజీవి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (రథసారథి న్యూస్): అంగన్‌వాడీ టీచర్లకు కేటాయించిన బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ) విధుల విషయంలో అధికారుల ఒత్తిడిని వెంటనే తొలగించాలని, పెండింగ్‌లో ఉన్న బీఎల్‌ఓ పారితోషికాన్ని తక్షణమే చెల్లించాలని ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టీయూసీసీ నాయకుడు చిరంజీవి మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లు తమ సాధారణ విధులతో పాటు బీఎల్‌ఓ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అయితే బీఎల్‌ఓ విధులకు సంబంధించి వారికి అందాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు. బీఎల్‌ఓ విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లపై ఎలాంటి అనవసర ఒత్తిడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామాల్లో బీఎల్‌ఓలు విధులు నిర్వహించే సమయంలో ప్రజలు వారికి సహకరించేలా అధికారులు అవగాహన కల్పించాలని, విధుల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ట్రైనర్ కలెక్టర్ ప్రతిభ శేఖర్ మాట్లాడుతూ గ్రామాల్లో బీఎల్‌ఓలకు ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారిపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్ల న్యాయమైన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌ఓ విద్యాసాగర్, రెవెన్యూ శాఖకు చెందిన గోపాల్, కాజా శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఎల్‌ఓ విధుల్లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు వినుకుమారి, పూలమ్మ, లక్ష్మి, లలిత, శశికళ, శోభ, సునీత, శైలజ తదితరులు పాల్గొన్నారు



