Sangareddy

కేంద్ర ప్రభుత్వ అసమర్థత పాలనలో పెరిగిపోతున్న నిరుద్యోగం

-అక్టోబర్ 2న చలో ఢిల్లీ జయప్రదం చేయండి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి డివైఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డి వై ఎఫ్ ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీకాంత్, జంగం బాబురావు లు మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ అసమర్థత విధానాల వల్లన దేశంలో, రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందాని, దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని అన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దేశ యువతి యువకులను మోడీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా 12 సంవత్సరాలు గడుస్తున్నా కోట్లాది మంది నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ,అన్యాయం మాత్రమే మిగిల్చిందని,ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తుండగా, మరోవైపు నీట్,రైల్వే, బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షల్లో వరుసగా ప్రశ్నపత్రాల లీకులు జరుగుతూ విద్యార్థి,యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోనే సుమారు పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని,నిరుద్యోగ యువతకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న, చలో ఢిల్లీ కార్యక్రమంలో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button