Sangareddy

31 వార్డు కౌన్సిలర్ సతీష్ రెడ్డి ని సన్మానించిన జగ్గారెడ్డి, నిర్మల

స్వచ్ఛ వాయు సర్వేక్షణ-2026 రాష్ట్ర స్థాయి అవార్డు కు ఎంపికైన సంగారెడ్డి మున్సిపాలిటీ 31 వ వార్డు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (రథసారథి న్యూస్):
స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో రాష్ట్ర స్థాయిలో సంగారెడ్డి మున్సిపాలిటీకి గుర్తింపు లభించడంతోపాటు, 31వ వార్డుకు రూ.10 లక్షల రూపాయల రివార్డు లభించిన సందర్భంగా వార్డు కౌన్సిలర్ జగ్గరి సతీష్ రెడ్డి ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి లు సన్మానించారు.
సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31వ వార్డు కు సంబంధించి 100 శాతం డోర్ టు డోర్ కలెక్షన్, 60 శాతం సోర్స్ సెగ్రిగేషన్, వార్డుల్లో గ్రీన్ డెవలప్‌మెంట్ , ప్రతి వీధికి డ్రైనేజ్ క్లీనింగ్ చేపట్టడం వంటి అంశాలకు గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

అవార్డు తో పాటు వార్డు అభివృద్ధికి రూ.10 లక్షల రివార్డు సైతం లభించినట్లు సతీష్ తెలిపారు అవార్డు సాధించేందుకు సహకరించిన మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కమిషనర్తో పాటు ఇతర అధికారులకు , 31 వ వార్డు ప్రజలకు ఈ సందర్భంగా జగ్గారెడ్డి, నిర్మల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు జార్జ్,కూన సంతోష్, కిరణ్ గౌడ్, వార్డు నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button