మాజీ మంత్రి హరీశ్ రావుకు మట్టి వినాయక విగ్రహం అందజేత

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 11 (రథసారథి న్యూస్):
మాజీ మంత్రి హరీశ్ రావును బీఆర్ఎస్‌వీ నాయకుడు అఖిల్ మర్యాదపూర్వకంగా కలిసి మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అఖిల్ పేర్కొన్నారు. ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలని సూచించారు.
మట్టి విగ్రహాల వినియోగం ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని స్వీకరించిన మాజీ మంత్రి హరీశ్ రావు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసద్, అడ్నాన్, సబీల్ తదితరులు పాల్గొన్నారు.



