Sangareddy

అనారోగ్యంతో బాధపడుతున్న ఆంజనేయులు గౌడ్‌కు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ పరామర్శ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (రథసారథి న్యూస్): ఇటీవల అనారోగ్యానికి గురైన మరెపల్లి ఆంజనేయులు గౌడ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ పరామర్శించారు. ఆంజనేయులు గౌడ్‌ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆంజనేయులు గౌడ్‌ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌, కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, మల్ల గౌడ్‌, అంజిరెడ్డి, అరవింద్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్యాంరావు, ధనగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button