ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి
– బీజేపీ యువ మోర్చా

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (రథసారథి న్యూస్):
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే ఆదేశాల మేరకు, సంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చౌటకూర్ మండలం వన్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కోశాధికారి నరేంద్ర్ దేశ్పాండే, బీజేపీ ఎస్సీ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంటి ప్రభు, బీజేపీ యువ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొర్రా ప్రవీణ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర్ దేశ్పాండే, బొర్రా ప్రవీణ్, చంటి ప్రభు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులపై, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఈ నిరసనను రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేసి ఉద్యమాన్ని విస్తృత స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కూడా పాల్గొని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తెనుగు సాయితేజ, ఆందోల్ అసెంబ్లీ లీగల్ సెల్ కన్వీనర్ కళాలి వినోద్ కుమార్ గౌడ్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కన్వీనర్ పల్లె ప్రవీణ్ కుమార్ గౌడ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ప్రవీణ్ రెడ్డి, బీజేపీ సంగారెడ్డి మండల అధ్యక్షులు గిరి, ప్రవీణప్ప, పుట్టి మోహన్, రవి, నవీన్, కృష్ణ, యువ మోర్చా కార్యకర్తలు, బీజేపీ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



