Hyderabad

కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 6 (రథసారథి న్యూస్):

బీఆర్‌ఎస్‌ఎల్పీ సంయుక్త సమావేశం అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు, బీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పోరాడుతూ, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని కేసీఆర్‌ సూచించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల పక్షాన బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలంగా పనిచేసేందుకు నాయకులు, ఎమ్మెల్యేలు సమష్టిగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button