Sangareddy

జాతీయ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి

దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 17 (రథసారథి న్యూస్): జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ గురువారం సంగారెడ్డిలోని తన శిబిర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

దేశ సమైక్యత, సమగ్రత కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి ప్రత్యేకత అని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ సమాజంలో సోదరభావం, పరస్పర గౌరవం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ కొండల్‌రెడ్డి, మనోహర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్‌, చక్రపాణి, రామప్ప, కౌన్సిలర్లు, సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button