
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామంలో వీరశైవ భవన్‌కు కేటాయించిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్న నేపథ్యంలో వీరశైవ సమాజం ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా భూమికి సంబంధించిన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు, వీరశైవ భవన్ స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమస్యను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలుతో పాటు సలహాదారులు వెన్న చక్రేశ్వర్, అడివప్ప, కోశాధికారి సంతోష్ పాటిల్, సదాశివపేట శివకుమార్, పట్లోళ్ల నాగేశ్వర్ పాటిల్, నాగరాజు, శేఖర్, ప్రశాంత్, అభినయ్ కుమార్, కిరణ్ కుమార్, విద్యాసాగర్, భవాని, ప్రకాష్, నరేందర్, మహిళా ప్రతినిధులు అరుణ, శారద, వసంత తదితరులు పాల్గొన్నారు.



