కంది, తోగర్‌పల్లి గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ
కంది మండలంలోని కంది గ్రామం, కొండాపూర్ మండలంలోని తోగర్‌పల్లి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 26 (రథసారథి న్యూస్):
కంది మండలంలోని కంది గ్రామం, కొండాపూర్ మండలంలోని తోగర్‌పల్లి గ్రామంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు పంచజన్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణ, ప్రజా హక్కుల సాధన, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ విస్తరణకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెండా పండుగ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు మురళీకృష్ణ, శంకర్ నాయక్‌తో పాటు పార్టీ నాయకులు కంది ప్రదీప్, ధనుష్, వేణు, సురేష్, సందీప్, అరవింద్, అరుణ్, అనిల్, శివ, అఖిల్, భరత్, ఎం. రాహుల్ యాదవ్, బి. వేణు, డి. శివకుమార్, ఎం.డి. జుబేర్, ఎ. హర్ష, ఎం.డి. ఆసిఫ్, ఎం.డి. ముజ్జు, గొప్పల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, రజనీకాంత్, కృష్ణమోహన్, సాయికాంత్ గౌడ్, శరణ్ నితిన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు


