Sangareddy

రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలి

గ్రామస్థులు మృతిచెందితే ఎక్కడ పెట్టాలో తెలియక నిత్యం నరకయాతన-ఆరడుగుల జాగకోసం గ్రామస్థుల ఆక్రందన

కలెక్టర్ పరిష్కారం చూపాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి ధర్నా…

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 27 (రథసారథి న్యూస్):

సదాశివపేట మండలం రేజింతల్ గ్రామంలో దళితులు, మైనార్టీలు, బీసీ, పేదల స్మశాన వాటిక సమస్య వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆపీస్ వద్ద స్మశాన వాటికకు స్థలం కేటాయింపు చేయాలని ధర్నా చేసి కలెక్టర్ కు వినతి పత్రం జరిగింది.ధర్నా కు ముందు కేకే భవన్ నుండి కలెక్టర్ ఆపీస్ వరకు ప్రదర్శన చేయటం జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రేజింతల్ గ్రామంలో శ్మశాన వాటిక స్థలం కేటాయించాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం సర్వే నెంబరు 149లో ఉన్న 4.09 ఎకరాలు ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక స్థలం వెంటనే కేటాయించాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్న కనీసం బొంద పెట్టుకోవడానికి జాగలేక ప్రజలు అనేక రకాల అవస్థలుపడుతున్నారని అన్నారు.ప్రభుత్వం మారిన ప్రజలు బ్రతుకులు మారటం లేదని అన్నారు. పేదలను పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

దళితులు బలహీన వర్గాలకు స్మశాన వాటికకు నిధులు కేటాయించాలని జీవోలు మార్గదర్శకాలు ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా కలెక్టర్,ప్రజాప్రతినిదులు దృష్టి పెట్టి సమస్యను వెంటనే పరిష్కరించాలని అన్నారు. రేజింతల్ గ్రామం సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సిపిఎం పార్టీ వెన్నంటి ఉంటదని ఉన్నారు గ్రామ ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ప్రజా పోరాటానికి ఎంత పెద్ద వారైనా, ప్రభుత్వం అయినా తలవంచాల్సిందేనని అన్నారు.

రేజింతల్ గ్రామంలో స్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం స్థలం కేటాయింపు చేయకపోతే ప్రజలే తిరుగుబాటు చేసి ఆక్రమిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు యస్.రమేష్ గౌడ్ పి.అశోక్, గ్రామ ప్రజలు వీరస్వామి, గోపాల్,భాస్కర్, సంయోజన్, మోహన్, రమేష్,బుచ్చయ్య, మానేయ,ఆనందం, శివయ్య,చంద్రయ్య, వినయ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button