సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను విజయవంతం చేద్దాం
సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ-కె.దయాకర్ రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (రథసారథి న్యూస్):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 6న హైదరాబాద్లోని సరూర్నగర్లో నిర్వహించనున్న సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పోస్టర్ను ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ కె .దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కె.దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సంకల్ప సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి విద్యార్థులు, యువత, బీసీ నాయకులు, సామాజికవేత్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బీసీల హక్కుల పరిరక్షణ, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభ చారిత్రాత్మకంగా నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణాకర్ చంద్రిక ,నల్ల కృష్ణమోహన్, నవీన్, బి సుధాకర్, శశాంక్ ,సారా నితిన్, సాయికాంత్ గౌడ్ , గోపాల్ రెడ్డి మనోజ్ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



