Sangareddy

సంగారెడ్డి నియోజకవర్గం లో పలు చోట్ల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి నియోజకవర్గం లో పలు చోట్ల జరిగిన ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి నియోజకవర్గం లో పలు చోట్ల జరిగిన ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామం లోని దుర్గమ్మ, పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆమె అమ్మ వార్లకు స్వయంగా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్రహ్మ చారి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. అనంతరం సదాశివ పేట పట్టణం లోని దుర్గమ్మ గుడి వద్ద జరిగిన బోనాల ఉత్సవం లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంఅర్ఎఫ్ కార్మిక సంఘం నాయకుడు శేఖర్ తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం లోని సంజీవ నగర్ కాలనీ లో పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. గుడిని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు మధు, కాలనీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button