Sangareddy

పద్మశాలి సంఘం బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్

బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (రథసారథి న్యూస్):

ఆషాఢ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ బోనాల ఉత్సవాల విశిష్టతను కొనియాడారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుండు సత్యనారాయణ, బాబురావు, రాజు, జీవీ శ్రీనివాస్, విఠల్, చింత గోపాల్, చింత సాయినాథ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button