సదాశివపేటలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (రథసారథి న్యూస్):
సదాశివపేట పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలు, ఊరేగింపు కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి పతకేరి, గొల్లకేరి పద్మశాలి సంఘం, కురుమ సంఘం,కౌన్సిలర్ గౌరీదేవి తుల్జారం రాఘవేంద్ర నగర్ బోనాలు, మహంకాళి ఆలయం, చాపలకేరి మహంకాళి బోనాలు , బంగారు మైసమ్మ బోనాలు , గొల్ల యాదవ సంఘం బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాలకు విచ్చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ముచ్చటిస్తూ బోనాల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, పట్టణ అధ్యక్షుడు వీరేశం, చింత సాయినాథ్, చెన్నకర్ , కౌన్సిలర్ సోమశేఖర్, శ్రీధర్ రెడ్డి, అశోక్ గౌడ్, చిక్కుల మల్లేశం, నగేష్, సంక్షయ్ గౌడ్, నక్క పప్పి నాని శ్రీకాంత్, నల్ల సుధాకర్, మెరుగు శంకర్, మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



