
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 7 (రథసారథి న్యూస్): ఆషాఢ మాస విశిష్టతను పురస్కరించుకుని శ్రీ వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో శాకంబరి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాసంస్థాన్ అధ్యక్షుడు శ్రీ తోపాజీ అనంతకిషన్ నేతృత్వంలో జరిగిన ఈ మహోత్సవంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు శాకంబరి దేవి స్వరూపంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
ప్రకృతి సంపదకు ప్రతీకగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో కళాత్మకంగా అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ ప్రత్యేక అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి, జోగిని నిషా క్రాంతి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహోత్సవ నిర్వాహకులను అభినందించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, కోశాధికారి జూలకంటి మల్లేశం, అమేటి మహేందర్, నామ భాస్కర్, అమేటి భాస్కర్, తోపాజీ తేజ, అక్షంతల కృష్ణవేణి, అమేటి రాణి, ఇల్లంతల ప్రసన్నతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



