Sangareddy

కాంగ్రెస్‌ హామీలు అమలు చేయాలి

-ప్రజావాణిలో బీఆర్‌ఎస్‌ నాయకుల వినతిపత్రం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ ఎన్నికల హామీల అమలుపై బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ సూచనలతో జిల్లా వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమాల్లో వినతిపత్రాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పాండుకు బీఆర్‌ఎస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా జిల్లాలోని నాలుగు మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లోనూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, చింత సాయినాథ్‌, డాక్టర్‌ శ్రీహరి, మందుల వరలక్ష్మి, మనోహర్‌గౌడ్‌, నాగరాజ్‌గౌడ్‌, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button