Sangareddy

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 10 (రథసారథి న్యూస్): మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తాజా మాజీ అధ్యక్షులు రాంచందర్ అధ్యక్షతన పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల సెప్టెంబర్‌ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, పెద్దాపూర్‌కు చెందిన పీజీహెచ్‌ఎం ప్రకాష్, ఘనపూర్‌ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయులు ప్రకాష్, గంగారం మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు యాదగిరిని శాలువా, జ్ఞాపిక, పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చేబర్తి యాదగిరి మాట్లాడుతూ.. ఇటీవల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌పై కల్పిత వ్యాఖ్యలు, పుస్తక రచనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండించారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ తక్షణమే అంబేద్కర్‌ విగ్రహం వద్ద క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్‌ గొప్పతనాన్ని కొనియాడుతున్న సమయంలో ఆయనపై విషప్రచారం చేయడం తగదని హితవు పలికారు.

భారత రాజ్యాంగాన్ని రూపొందించి దేశంలోని కోట్లాది ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. సమాజాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో రాజ్యాధికార సాధన దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్యాగాల పునాదులపైనే అధికారం సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలను అనుభవించే దశలో ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, ఎంఈఎఫ్‌ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి స్వామినాథ్, పీజీహెచ్‌ఎం సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవరావు, అవార్డు గ్రహీతలు కృష్ణయ్య, ప్రకాష్, యాదగిరి, పదవీ విరమణ పొందిన పీజీహెచ్‌ఎం అమృత్, రాష్ట్ర నాయకులు ఉప్పరిపల్లి నాగభూషణం, డాక్టర్ ఆనంద్, సంగారెడ్డి వైద్య కళాశాల ప్రొఫెసర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యాయులు కిష్టయ్య, శాంతికుమార్, దుర్గాల శ్రీనివాస్, శామ్, జైపాల్, విజయానంద్, టేక్మాల్ దుర్గయ్య, గోపాల్, మనోహర్, పీడీ రాజు, సాయిలు, ప్యాలారం జైపాల్, ప్రముఖ కవి డప్పోళ్ల రమేష్, న్యాయవాది మాతంగి చిరంజీవి ప్రసాద్, జేఏఓ మారుతి, డీపీఎంఓ వెంకయ్య, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button