ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా చిరంజీవి ఎన్నిక
నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) సంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశం

నారాయణఖేడ్, జూలై 23 (రథసారథి న్యూస్): నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) సంగారెడ్డి జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోజి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి. రాములు యాదవ్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కన్వీనింగ్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా చిరంజీవిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కమిటీ సభ్యులుగా లక్ష్మణ్, మోష, బోరంచ గణేష్, షోయల్ రాజేష్, శోభలను నియమించారు.
అనంతరం జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన చిరంజీవి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



