Sangareddy

కుమ్మర్ల బోనాల పండుగలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

అశాడ మాసం సందర్భంగా సంగారెడ్డి ఎఫ్అర్ఎస్ ఎల్లమ్మ కు తొలి బోనం సమర్పించిన కుమ్మర్లు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):

అశాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణం లో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్అర్ఎస్ ఎల్లమ్మ తల్లి కి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. ఐబి నుండి మొదలుకుని ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈ బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆశాడమాసం అత్యంత పవిత్రమైన మాసం అన్నారు. ఆశాడ మాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం అన్నారు.

ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు శైలేష్ రెడ్డి, కృష్ణ, అశ్విన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం, కుమ్మరి సంఘం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button