ఆషాఢ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్
పద్మశాలి సంఘం ఆషాఢ విందు* -ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. మొదటగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆషాఢ విందు భోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పెద్దలను, సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అనంతరం ఆషాఢం సందర్భంగా మల్కాపూర్ ఎల్లమ్మ దేవాలయం వద్ద మల్కాపూర్ గౌడ్ సంఘం మాజీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్లమ్మ బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, శ్రీధర్ రెడ్డి, రామప్ప, జలేందర్, అంజద్, వాజిద్‌తో పాటు పద్మశాలి సంఘం, గౌడ్ సంఘం నాయకులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

