నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు
సంగారెడ్డి పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 28 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి పట్టణంలో నాయిబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల ఊరేగింపు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. సంగారెడ్డి ఐబీ నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు అస్తబల్ వరకు సంప్రదాయబద్ధంగా సాగింది. డప్పు చప్పుళ్లు, భక్తిగీతాలు, పోతరాజుల విన్యాసాలు, మహిళలు సమర్పించిన బోనాలతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి పాల్గొని శ్రీ ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల ఊరేగింపులో భక్తులతో కలిసి పాల్గొని వారిని పలకరించారు. సాంప్రదాయ నృత్యాలతో భక్తులతో కలిసి చిందులు వేస్తూ ఉత్సాహాన్ని నింపారు. అనంతరం నిర్వాహకులు చింత సాయినాథ్, కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డిలను శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు అమ్మవారి కటాక్షం ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కసిని శ్రీకాంత్, రవి, అక్షయ్, అఖిల్, నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు మాణిక్య ప్రభు, యాదయ్య, సుకుమార్, మోహన్, సత్యనారాయణ, సంతోష్ కుమార్, దయానందం, మామిళ్ల నాగభూషణం, కల్వకుంట చంద్ర ప్రకాష్, కల్వకుంట వెంకటేష్, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



