నారాయణఖేడ్ తాలూకా టీఎన్జీవోస్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
ఉద్యోగులు విధులను సమర్థంగా నిర్వర్తిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలి: జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ

నారాయణఖేడ్, జూలై 22 (రథసారథి న్యూస్): నారాయణఖేడ్ తాలూకా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం జిల్లా అధ్యక్షుడు ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగాయి.
ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం.డి. మిస్కిన్, ప్రధాన కార్యదర్శిగా పి. దత్తు, అసోసియేట్ కార్యదర్శిగా కె. రవీందర్, కోశాధికారిగా భాస్కర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సంతోష్ కుమార్, రజిత, సాయన్న, సంయుక్త కార్యదర్శులుగా అరుణ్, విట్టవ్వ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ముజమ్మిల్, ప్రచార కార్యదర్శిగా రుక్మారెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాగలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, పండరీ, సూర్యకాంత్, ప్రవీణ్, రాజు నాయక్ బాధ్యతలు చేపట్టారు.
జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వి. రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాస్‌తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.డి.
జావీద్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగులు ముందుగా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, అదే సమయంలో ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఉద్యోగి సహకారం అవసరమని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు ఎం.డి. మిస్కిన్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తూ ప్రతి ఉద్యోగిని కలుపుకొని యూనియన్ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.



