Sangareddy

ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం

-ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (రథసారథి న్యూస్): ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమని సంగారెడ్డి శాసనసభ్యుడు చింత ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని తన శిబిర కార్యాలయంలో ప్రజలను కలిసి వారి సమస్యలను ఓర్పుగా ఆలకించారు.

జిల్లాలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చిన ప్రజలు వ్యక్తిగత, సామాజిక, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను శాసనసభ్యుడి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని శ్రద్ధగా పరిశీలించిన చింత ప్రభాకర్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు.

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button