Sangareddy
డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకుడు మందుల రాధా కృష్ణ
బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల రాధా కృష్ణ సోమవారం డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
బిఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల రాధా కృష్ణ సోమవారం డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. రాధ కృష్ణ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యం లో రాష్ట్రం లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్ గౌడ్, జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, తోపాజి హరీష్, నగేష్ , శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



