Sangareddy

“విద్యార్థులకు షీ టీమ్ అవగాహన కార్యక్రమం*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), తోగర్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, బాలుర సంక్షేమ వసతి గృహంలో గురువారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వసతి గృహ సిబ్బందికి మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఈవ్‌టీజింగ్, బాలల హక్కులు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించారు.

సమస్యలు ఎదురైనప్పుడు నిర్భయంగా షీ టీమ్‌ను ఆశ్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1,200 మంది విద్యార్థులతో పాటు పాఠశాలలు, వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button