Sangareddy
సంగారెడ్డి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 6 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాల మార్పిడి, 33 కేవీ విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులను సంబంధిత శాఖలు ముమ్మరంగా చేపట్టాయి. నిర్మాణ పనులను కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడీ లక్ష్మణ్‌తో పాటు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.



